Advertisementt

SSMB28 పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Tue 17th May 2022 10:55 PM
ssmb28,mahesh babu,trivikram,thaman,pooja hegde,super star krishna birthday  SSMB28 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News on SSMB28 SSMB28 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట సక్సెస్ తో ఫుల్ హ్యాపీ గా మంచి జోష్ లో ఉన్నట్టుగా నిన్న కర్నూల్ లో జరిగిన మా మా మాస్ సెలెబ్రేషన్స్ లో స్టేజ్ పై మాస్ స్టెప్స్ కి డాన్స్ చేసినప్పుడు చూసాం. సర్కారు వారి పాట హిట్ అవడంతో మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీకి  కొద్దిగా గ్యాప్ ఉండడంతో ఓ ఫారిన్ ట్రిప్ ఫ్యామిలీ తో ప్లాన్ చేసుకున్నారని, ఆ ట్రిప్ కి వెళ్లొచ్చాక త్రివిక్రమ్ తో SSMB28 రెగ్యులర్ షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. మహేష్ కూడా సర్కారు వారి ప్రమోషన్స్ లో జూన్ నుండి త్రివిక్రమ్ మూవీ మొదలు కాబోతున్నట్టుగా చెప్పారు. 

అయితే మహేష్ బాబు సినిమాల నుండి ఆయన తండ్రి కృష్ణ గారి పుట్టినరోజునాడు ఏదో ఒక అప్ డేట్ ఇచ్చి ఘట్టమనేని ఫాన్స్ ని ఆనందపెట్టడం మహేష్ అనవాయితీగా చేస్తున్నారు. ఈసారి మహేష్ పుట్టిన రోజుకి కూడా SSMB28 నుండి అదిరిపోయే ట్రీట్ ఉండబోతుంది అని, అది ఫస్ట్ లుక్ అయినా కావొచ్చు, లేదా SSMB 28 టైటిల్ అయినా కావొచ్చు అంటున్నారు. మే 31వ తేదీన కృష్ణ గారి బర్త్ డే స్పెషల్ గా మహేష్ -త్రివిక్రమ్ కాంబోలో మొదలు కాబోతున్న SSMB28 అప్ డేట్ కోసం మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక అతడు, ఖలేజా సినిమాల తర్వాత వారి కలయికలో రాబోతున్న SSMB28 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మహేష్ తో పూజ హెగ్డే రొమాన్స్ చేస్తుంది.

Interesting News on SSMB28:

SSMB 28 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ