Advertisementt

పుష్ప2 షూట్ అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Tue 17th May 2022 06:29 PM
pushpa 2,pushpa the rule,allu arjun,sukumar,pushpa 2 release date  పుష్ప2 షూట్ అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Pushpa the rule shooting update పుష్ప2 షూట్ అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన పుష్ప ద రైజ్ అన్ని భాషల్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తేవడమే కాదు, పుష్ప గా అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ కి అందరూ షాకయ్యారు. మాస్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ హిందీ ఆడియన్స్ ని పడేసారు. ఎలాంటి హడావిడి లేకుండానే నార్త్ లో పుష్ప ఏకంగా 100 కోట్లు కొలగొట్టింది. దానితో పార్ట్ టు గా రాబోతున్న పుష్ప ద రూల్ పై అంచనాలు, బడ్జెట్ కూడా పెరిగిపోతున్నాయి. పుష్ప 2 కి ఏకంగా 400 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కాదు, నిజంగా 400 కోట్ల బడ్జెట్ పుష్ప ద రూల్ కోసం వెచ్చిస్తున్నారట మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలు. ఇక జూన్ నుండి పుష్ప 2 షూటింగ్ మొదలవుతుంది, డిసెంబర్ లో పుష్ప ద రూల్ రిలీజ్ అంటూ సుకుమార్ గత ఏడాది పుష్ప ప్రమోషన్స్ లో చెప్పారు.

కానీ తాజాగా పుష్ప ద రూల్ షూటింగ్ జులై నుండి మొదలు కాబోతుంది. జులై లో మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరి కల్లా పుష్ప షూటింగ్ ఫినిష్ చేసి.. నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అలాగే సినిమా ప్రమోషన్స్ కి టైం తీసుకుని పుష్ప 2 ని వచ్చే సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ - రష్మిక హీరో, హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతుండగా.. సెకండ్ పార్ట్ కి కొంతమంది బాలీవుడ్ నటులని సుకుమార్ యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పుష్ప ద రూల్ లో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ని దేవీశ్రీ కంపోజ్ చేస్తున్నారు.. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీనే రంగంలోకి దింపబోతున్నట్లుగా టాక్.  

Pushpa the rule shooting update:

Pushpa 2 Release Date, Shoot Schedule Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ