ప్రభాస్ ఫాన్స్ కి వరసగా స్వీట్ న్యూస్ లే వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ ఇంట్రో సీన్స్ పూర్తయ్యాయి అని, ప్రాజెక్ట్ కె ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కె లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్ అటు మాస్ యాక్షన్ మూవీ సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతారని వారి ఆశ. ఇక ప్రశాంత్ నీల్ కూడా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉండి సలార్ కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేయించే పనిలో ఉన్నారు. ప్రోజెక్ట్ కె లో ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి సలార్ సెట్స్ మీదకెళ్ళిపోతారు.
ప్రాజెక్ట్ కె షెడ్యూల్ పూర్తవడం, మళ్ళీ జూన్ నెలాఖరులో మరో షెడ్యూల్ మొదలు పెడతామని చెప్పడంతో.. ఈ గ్యాప్ లో ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఓ రెండు రోజుల గ్యాప్ తో ప్రభాస్ సలార్ కొత్త షెడ్యూల్ లో పాల్గొననబోతున్నారని, సలార్ నుండి రేపో మాపో అప్ డేట్ వస్తుంది అని అంటున్నారు. సలార్ కొత్త షెడ్యూల్ మొదలు కాగానే.. ప్రభాస్ సలార్ టీజర్ అప్ డేట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా సలార్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి.