యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20. మే 20 ఎన్టీఆర్ నటిస్తున్న NTR 30 నుండి అలాగే ఎన్టీఆర్ 31 నుండి లుక్స్ కానీ, టైటిల్స్ కానీ రివీల్ అవుతాయి.. తారక్ అన్న అప్ డేట్స్ తో సోషల్ మీడియా ని ఊపేద్దామని ఎన్టీఆర్ ఫాన్స్ వేచి చూస్త్రున్నారు. ఈ లోపులో NTR 31 నుండి ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. ప్రశాంత్ నీల్ నేడో రేపో సలార్ సెట్స్ మీదకి వెళ్ళిపోతారు. ప్రభాస్ ఫ్రీ అవ్వడం కోసమే ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కాస్త బిజీగా ఉండడంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం టెస్ట్ షూట్ నిర్వహించడమే కాకుండా.. NTR 31 లో నటించబోయే నటుల ఎంపిక పై దృష్టి పెట్టారని అంటున్నారు. అయితే కథ డిమాండ్ ని బట్టి NTR 31 లో ఎన్టీఆర్ తో పాటుగా మరో పేరున్న హీరోని తీసుకోవాలనుకున్నారట.
ఆ కేరెక్టర్ కోసం ప్రశాంత్ నీల్ లోకనాయకుడు కమల్ హాసన్ ని సంప్రదిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ సినిమాలో కమల్ హాసన్ అంటే మాములు విషయం కాదు, అందుకే కమల్ అయితే సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది అని ప్రశాంత్ నీల్ కమల్ ని సంప్రదిస్తున్నారని, కమల్ గనక NTR 31 లో కనిపిస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలే అంటున్నారు, మరి ఈ విషయమై అధికారిక ప్రకటన లేదు కానీ.. ఈ న్యూస్ నిజమైతే NTR31 పై మాములుగా అంచనాలుండవు. ఎన్టీఆర్ - కమల్ స్క్రీన్ షేర్ చేసుకుంటే.. పాన్ ఇండియా మార్కెట్ లో భీభత్సమే.