గత కొన్ని రోజులుగా అఖిల్ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. బీచ్ లో ఖుషి గా గడుపుతున్న సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. తాను జిమ్ లో ఎంతగా కష్టపడి బాడీ పెంచానో చూడండి.. అలాగే మాల్దీవుల వెకేషన్స్ లో ఎంజోయ్మెంట్ ని అఖిల్ ఫాన్స్ కోసం షేర్ చెయ్యడంతో అక్కినేని ఫాన్స్ అఖిల్ మేకోవర్ కి ముగ్దులవుతున్నారు. అదలా ఉంటే.. గత రెండు రోజులుగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ఏజెంట్ మూవీ పై నెగెటివ్ న్యూస్ లు సోషల్ మీడియాలో ప్రచారం లో ఉన్నాయి.
అయోమయంలో ఏజెంట్, ఏజెంట్ అనుకున్న డేట్ విడుదల కావడం లేదు, ఏజెంట్ షూటింగ్ ఆగిపోయింది అంటూ రకరకాల న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి. దానితో అక్కినేని ఫాన్స్ లో కంగారు మొదలయ్యింది. కానీ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర లైన్ లోకి వచ్చి ఏజెంట్ పై వస్తున్న రూమర్స్ ని నమ్మకండి.. ఏజెంట్ కొత్త షెడ్యూల్ మనాలిలో స్టార్ట్ అయ్యింది. అలాగే ఏజెంట్ టీజర్ అప్ డేట్ త్వరలోనే.. ప్లీజ్ ఏజెంట్ కి సంబందించిన న్యూస్ లు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లోనే చెక్ చేసుకోండి.. రూమర్స్ ని నమ్మొద్దు అంటూ ఆయన ఏజెంట్ పై అప్ డేట్ ఇవ్వడంతో అక్కినేని ఫాన్స్ కూల్ అవుతున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. ముంబై మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.