Advertisementt

మహేష్ సినిమా కోసం సీక్రెట్ గా థియేటర్ కి

Mon 16th May 2022 03:37 PM
sai pallavi,svp,mahesh babu,sarkaru vaari paata  మహేష్ సినిమా కోసం సీక్రెట్ గా థియేటర్ కి
Sai Pallavi secretly watches Sarkaru Vaari Paata మహేష్ సినిమా కోసం సీక్రెట్ గా థియేటర్ కి
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో హిట్ కొట్టేసారు. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వినిపించినా, సోషల్ మీడియాలో సర్కారు వారి పాట పై నెగెటివ్ హాష్ టాగ్స్ ట్రెండ్ అయినా.. మహేష్ మాత్రం కలెక్షన్స్ తో కొడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్లు కొల్లగొట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. అయితే గతంలో మహేష్ బాబు తో సినిమా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సర్కారు వారి పాటని ఈ ఆదివారం సీక్రెట్ గా వీక్షించడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 

మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అనిల్ రావిపూడి సాయి పల్లవిని సంప్రదించగా.. ఆ సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ ఉండడంతో సాయి పల్లవి ఆ సినిమాని సున్నితంగా తిరస్కరించింది అనే న్యూస్ నడవడమే కాదు.. ఓ ఇంటర్వ్యూలో అలాంటి సీన్స్ కి, గ్లామర్ షో కి తాను దూరమని చెప్పింది ఆమె. అయితే సాయి పల్లవి మహేష్ నటించిన సర్కారు వారి పాటని పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌ ముసుగేసుకుని అంటే స్కార్ఫ్ కట్టుకుని తనని ఎవరు గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆదివారం ఆ సినిమాని వీక్షించి మళ్ళీ స్కార్ఫ్ తో ముఖాన్ని కప్పేసి.. ఫోన్ మాట్లాడుకుంటూ థియేటర్ నుండి వెళ్లిపోయిన దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Sai Pallavi secretly watches Sarkaru Vaari Paata:

Sai Pallavi watches SVP in disguise

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ