గత శుక్రవారం మహేష్ బాబు సర్కారు వారి పాట సోలోగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో ఆడియన్స్ ని అల్లాడించింది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటూ ఆడియన్స్ సర్కారు వారి పాటని హిట్ చేసేసారు. ఇక ఈ వారం అంటే మే 20 న రెండు మూడు సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చినా.. ఫైనల్ గా రాజ శేఖర్ నటించిన శేఖర్ మూవీ ఒక్కటే బాక్సాఫీసు దగ్గరకి రాబోతుంది. నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి కూడా మే 20 నే రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆ సినిమా వాయిదాపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. కానీ రాజశేఖర్ మారియు జీవితలు శేఖర్ రిలీజ్ డేట్ ఇచ్చినప్పటినుండి శేఖర్ ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి సోలో ఇంటర్వూస్, అలాగే శేఖర్ కాలేజ్ టూర్ అంటూ చాలా బిజీగా సినిమాని ఆడియన్స్ లోకి తీసుకు వెళుతున్నారు. అంతేకాకుండా ఈటీవీ క్యాష్, జబర్దస్త్ షోస్ లోను శేఖర్ ని ప్రమోట్ చేసారు. తర్వాత సాయి కుమార్ వావ్ లోకి శేఖర్ టీం రాబోతుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్లి సినిమాని ప్రమోట్ చేసుకుని వచ్చారు. అయిపోతే ఈ వారం ఎలాంటి పోటీ లేకుండానే శేఖర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాకపోతే ఓటిటిలో మాత్రం రాజమౌళి ట్రిపుల్ ఆర్ జీ 5 లోను, ఆచార్య అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్నాయి. అలాగే శ్రీ విష్ణు భళా తందనానా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అదే మే 20 న రిలీజ్ కాబోతుంది. సో శేఖర్ కి థియేటర్స్ లో పోటీ లేదన్నమాట.