బిగ్ బాస్ అంటే 15 నుండి 18 మంది హౌస్ లోకి అడుగుపెడతారు. వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ ఫైనల్ గా ఆ వారంలో టాప్ లోకి వచ్చేవారు ఓ ఐదుగురు ఉంటారు. అంటే టాప్ 5 అన్నమాట. కానీ ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ అంతా కొత్త గా డిజైన్ చేసారు. అందులో ఒకటి వైల్డ్ కార్డు ఎంట్రీ, మరొకటి రీ ఎంట్రీ ప్లాన్ చేసి మరో ఇద్దరిని హౌస్ లోకి యాడ్ చేసారు. ఇక 11 వారాలు పూర్తయ్యి ఫైనల్ వీక్ 12 వ వారంలోకి బిగ్ బాస్ సభ్యులు అడుగుపెట్టారు. అయితే నిన్నటివరకు టాప్ 5 లేదా టాప్ 7 అనే కన్ఫ్యూషన్ లో జనాలు ఉన్నారు. కానీ గత రాత్రి హౌస్ నుండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఆయన టాస్క్ అదిరిపోయేలా ఆడినా.. ఆయన ఎమోషన్స్, ఇంటి సభ్యులతో గొడవలు కారణంగా లాస్ట్ వీక్ లో లాస్ట్ సభ్యుడిగా ఎలిమినేట్ అయ్యాడు
ఇక ఫైనల్ గా టాప్ 7 లో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్, బాబా భాస్కర్, అనిల్, ఆరియానా, యాంకర్ శివ లు ఉన్నారు. వీరిలో అరియనా, అనిల్, మిత్ర శర్మ వీక్ కంటెస్టెంట్స్ అయినా వాళ్ళ లక్కు బట్టి వాళ్ళు టాప్ 7 లో ఉండగా.. టైటిల్ పోరు మాత్రం అఖిల్ అండ్ బిందు మధ్యలోనే ఉంది. ఈసారి రన్నర్ గా కాదు విన్నర్ గా వెళ్లాలని అఖిల్ ఫిక్స్ అవగా.. బిందు మాధవి మాత్రం నేను చాలా స్ట్రాంగ్ నాకే టైటిల్ అనుకుంటుంది. మరి ఫైనల్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ టైటిల్ ని ఎవరు ఈ వారం సొంతం చేసుకుంటారో వచ్చే ఆదివారం తెలిసిపోతుంది.