Advertisementt

అటు ఎన్టీఆర్ ఇటు సమంత ఇద్దరూ ఇద్దరే

Mon 16th May 2022 11:41 AM
samantha,telugu heroine,ntr,rpabhas,allu arjun,rashmika,pooja hegde,rrr  అటు ఎన్టీఆర్ ఇటు సమంత ఇద్దరూ ఇద్దరే
Jr NTR at No 1 and Prabhas at No 2 అటు ఎన్టీఆర్ ఇటు సమంత ఇద్దరూ ఇద్దరే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ లో కొమరం భీముడా సాంగ్ లో, అలాగే ఇంటర్వెల్ బాంగ్ లోను యాక్షన్ సీక్వెన్స్ లో ఇచ్చిన పెరఫార్మెన్స్ ఆయన కెరీర్ లో బెస్ట్ అని చెప్పేలా ఉంది. అయితే రీసెంట్ గా ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్‌ మీడియా వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్‌ పాపులర్‌ హీరోలు ఎవరనే విషయంలో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే లో టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ టాప్ 10 నటుల జాబితాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నెంబర్ వన్ ప్లేస్ ని ఆక్రమించారు. ఎన్టీఆర్ తర్వాత ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్, ఆ తర్వాత నాలుగో స్థానంలో ట్రిపుల్ ఆర్ మరో హీరో రామ్ చరణ్ ఉన్నారు.

అదే టాలీవుడ్ నుండి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా రష్మిక, పూజ హెగ్డే లను పక్కకునెట్టి మరీ సమంత నెంబర్ వన్ ప్లేస్ ని ఆక్రమించింది. ఆ తర్వాత ప్లేస్ లో పెళ్ళై, బాబు పుట్టిన కాజల్ అగర్వాల్, తర్వాత సినిమాలకు దూరం గా ఉన్న అనుష్క, ఆ తర్వాత ప్లేస్ లని పూజ హెగ్డే, రష్మిక, తమన్నా, కీర్తి సురేష్ ఆక్రమించారు. ఇదే ఓర్మాక్స్‌ మీడియా కోలీవుడ్, బాలీవుడ్, మలయాళం, కన్నడ లోను సర్వే నిత్వహించింది. బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ నటుడిగా అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ నిలిచారు. మోస్ట్‌ పాపులర్ హీరోయిన్‌గా అలియా భట్‌ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్‌, కృతి సనన్‌ వరస స్థానాల్లో ఉన్నారు.

Jr NTR at No 1 and Prabhas at No 2:

Samantha crowned most popular Telugu Heroine 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ