పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. భూమిక తో పవన్ కళ్యాణ్ రొమాంటిక్ అల్లరి ఆ సినిమాలో సూపర్బ్ గా హైలెట్ అయ్యింది. అలీ తో కామెడీ ట్రాక్ ఇవన్నీ సినిమాకి హైలెట్. అలాంటి ఖుషి టైటిల్ ని విజయ్ దేవరకొండ తన VD11 కోసం పెట్టేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో VD11 గా తెరకెక్కుతున్న సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషి టైటిల్ పెట్టేసారు. ఈ రోజు VD11 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేసింది టీం.
VD11టైటిల్ గా ఖుషి అని, ఈ సినిమాని డిసెంబర్ 23, 2022 లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉండగా.. విజయ్ దేవరకొండ - సమంత రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ నోటిలో సిగార్ పెట్టుకుని కాస్త స్టైలిష్ గా కనబడుతుండగా.. సమంత సారీ కట్టుకుని కాశ్మీరీ గర్ల్ గా కనిపిస్తుంది. సమంత చీర కి విజయ్ దేవరకొండ డ్రెస్ కి ముడిపెట్టారు. మరి విజయ్ దేవరకొండ-సమంత రొమాన్స్ సినిమాకి హైలెట్ అనేలా ఈ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది. శివ నిర్వాణ ఖుషి ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.