బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో నటరాజ్ మాస్టర్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యారు. అంటే ఇంకా ఏడుగురు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మరొక్క వారమే నాన్ స్టాప్ కి మిగిలి ఉంది. వచ్చే ఆదివారమే బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. అంటే ఈసారి టాప్ 5 కాకుండా 7 గురు ఉండేలా ఉన్నారు. బాబా భాస్కర్, అనిల్, అఖిల్, బిందు మాధవి, అరియనా, మిత్ర శర్మ, యాంకర్ శివ ఉన్నారు.
అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ఈసారి లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయమంటున్నారు ఆమె ఫాన్స్. సివంగి, ఆడపులిలా బిగ్ బాస్ టైటిల్ పొందేందుకు అర్హత ఆమెకే ఉంది అంటూ ఆమె ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరోపక్క అఖిల్ ఫాన్స్ కూడా అఖిల్ కే టైటిల్ అంటున్నారు. అఖిల్ సార్థక్‌కు భారీ ఫాలోయింగ్ ఉండటం కారణంగా టైటిల్ రేసులో తాను ఉన్నట్టు అఖిల్ కూడా ధీమాతో ఉన్నాడు. నేను స్ట్రాంగ్ ప్లేయర్ ని నాకు టైటిల్ పక్కా అని బిందు మాధవి కూడా అంతే ధీమాతో కనబడుతుంది. మరోపక్క అరియనా ఈసారి విమెన్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే బావుంటుంది అని, అది బిందు అయితే బావుంటుంది అని ఆమెని సపోర్ట్ చేస్తుంది. మరి ఫైనల్ గా అఖిల్ vs బిందు మాధవి అని టైటిల్ పోరులో వున్న.. చివరికి బిందు మాధవి కే ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి లేడీ కంటెస్టెంట్ ని విన్నర్ ని చేశామని బిగ్ బాస్ చెబుతుందేమో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.