ఈ రోజు AIG హాస్పిటల్ లో మా సభ్యులకి మెగా హెల్త్ క్యాంప్ అంటూ హెల్త్ చెకప్ చేయించి మరీ ప్రెస్ మీట్ పెట్టిన ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆ ప్రెస్ మీట్ లో మా బిల్డింగ్ పై, అలాగే సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై స్పందించారు. ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు.. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారు.. డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పెరొందిన వారు.. ఈ హెల్త్ చెకప్స్ వలన మా సభ్యులందరు బెనిఫిట్ పొందుతున్నారు..
మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. మా సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం.. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు.. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు.. ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ... పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకొవాలి.. మా సభ్యత్వం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము అంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెస్ మిట్ లో మంచు విష్ణు మట్లాడారు.