ఈ రోజు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎపిసోడ్ లోకి నాగార్జున వస్తారు. ఆదివారం నాగార్జున డే. నాన్ స్టాప్ 11వ వారం పూర్తి చేసుకుని 12 వ వారం లోకి అంటే లాస్ట్ వీక్ లోకి అడుగుపెడుతుంది. ఈ వారంలోనే ఫైనల్ విన్నర్ ఎవరో తేలిపోతారు. 11 వ వారంలో హౌస్ లో ఉన్న ఎనిమిదిమంది కూడా నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో కానీ.. నాగార్జున మాత్రం హౌస్ లో ఉన్న అగ్రెస్సివ్ మెంబెర్స్ కి గట్టిగా క్లాస్ పీకడం కాదు.. వెళ్లిపొమ్మంటూ హుకుం జారీచేశారు. ముందుగా నీకు హెల్త్ బాగోకపోయినా గేమ్ బాగా ఆడుతున్నావ్ అంటూ అరియానని మెచ్చుకున్న నాగార్జున.. నువ్వు హౌస్లో చేసే పనుల వలన ప్రాణం మీదకి వస్తుంది.. బిగ్ బాస్ కి అవకాశం రావడం మాములు విషయం కాదు అంటూ అరియనాకి క్లాస్ పీకారు నాగార్జున.
తర్వాత నటరాజ్ మాస్టర్ మీరు టాప్ 5 లోకి వెళ్లకపోతే చంపెయ్ అన్నారు. మీ పాప పెరిగాక ఈ వీడియో చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నారు. అలాగే బిందు తండ్రిని ఫెయిల్ అయ్యారు అనడం మాత్రం అసలు బాగోలేదు అనగానే నా పాప ని నామినేషన్స్ లోకి లాగింది సర్. నేను పాపని పెట్టుకుని గేమ్ ఆడుతున్నా అని, అవును నిజమే మీరు మీ పాప గురించి మట్లాడేదే బిందు అంది అన్నారు నాగార్జున. దానితో నటరాజ్ మోకాళ్ళ మీద కూర్చుని సారి చెప్పాడు. ఇక మిత్ర శర్మ ని లేపి ఏంటమ్మా చేతులు విరగ్గొట్టుకుంటున్నావ్ అనగానే అరియనా నామినేషన్స్ లో అలా ఇలా అంది అనగానే వెళ్లి చేతులు విరగ్గొట్టుకో అంటూ నాగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక బిందు నువ్వేమిటి నటరాజ్ మాస్టర్ పై గట్టిగా మాట్లాడుతూనే ఉమ్ము ఊసావ్. ఆయన అన్నమాటలకు నేను అలా చేశాను అనగానే.. నీ సంస్కారం ఏమైంది అంటూ నాగార్జున, బిందు తో పాటుగా ఈ వారం హౌస్ మేట్స్ కి గట్టిగా క్లాస్ పీకారు.