నందమూరి నట సింహం - మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా NBK 107 మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చెయ్యలేదు కానీ.. రెండు మూడు టైటిల్స్ అయితే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ మాస్ లుక్ లో ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేసారు. బ్లాక్ షర్ట్ లుంగీ తో బాలకృష్ణ ఫ్యాబులస్ లుక్ సోషల్ మీడియా ని ఊపేసింది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చెయ్యబోతున్నారు. అందులో ఒకటి సూపర్ స్టైలిష్ రోల్. ఆ క్లాసీ రోల్ కోసమే హీరోయిన్ శృతి హాసన్ ని పట్టుకొచ్చారు గోపీచంద్.
ఇక మరో పవర్ ఫుల్ రోల్ కి హీరోయిన్ అవసరం లేదన్నారు. కానీ ఇప్పుడు NBK107 లో మరో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందట. NBK107లో సెకండ్ హీరోయిన్‌గా మలయాళీ ముద్దుగుమ్మను ఓకే చేశారని తెలుస్తుంది. బాలయ్యకి జోడిగా రాబోతున్న ఆ సెకండ్ హీరోయిన్ హనీ రోజ్. ఆమె తెలుగు తెరకు గతంలోనే పరిచయం ఉన్నా.. అంతగా పాపులర్ కాలేదు. మలయాళ, కన్నడ, తమిళనట కూడా నటించిన హాని రోజ్ ఇప్పుడు బాలయ్య పక్కకి చేరింది అంటున్నారు. ఈ విషయమై త్వరలోకినే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.