బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ కంటెస్టెంట్స్ మధ్యన మాత్రం తగవులు, గొడవలు, అలకలు ఆగడం లేదు. లాస్ట్ నామినేషన్స్ లో అఖిల్ vs బిందు, బిందు vs నటరాజ్ అన్నట్టుగా ఉంటే.. తర్వాత టాస్క్ ల్లో అఖిల్ హెల్ప్ చెయ్యలేదు అంటూ నటరాజ్ నానా రచ్చ చేసాడు. ఇక ఎపిసోడ్ లో ఎవరు ఎంత స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నారో అనే టాస్క్ లో బిందు కి ఫ్రెండ్ శివ కి మధ్యన గొడవ జరిగింది. అనసూయ టాస్క్ లో బిందు, అఖిల్ కి షాకిచ్చే ప్రశ్నలు నెటిజెన్స్ నుండి ఎదురయ్యాయి.
ఇక తాజాగా టికెట్ టు ఫినాలే టాస్క్ కోసం బిగ్ బాస్ ఆవుపాలు టాస్క్ ఇచ్చాడు. అందులో ఆవు పాలు పట్టి బాటిల్స్ లో నింపాలి. ఎవరు ఎక్కువ బాటిల్స్ నింపితే వారే విన్నర్ అనగా.. నటరాజ్ మాస్టర్ ఎప్పటిలాగే టాస్క్ లో రాక్షసుడు మాదిరిమారిపోగా.. అఖిల్ ఆయనతో పోటీ పడ్డాడు. ఆ గొడవలో అఖిల్ పాల డబ్బాలోని పాలు కింద పడిపోవడంతో నటరాజ్ తో అఖిల్ గొడవ పెట్టుకున్నాడు. నేను కష్టపడి ఆడాను అని నటరాజ్ అనగానే.. అఖిల్ అందరూ కష్టపడే ఆడతారు అంటూ రెచ్చిపోయాడు. నేను ఇప్పటివరకు సోలోగానే ఆడాను, కష్టపడి ఆడాను అంటూ నటరాజ్ అఖిల్ మీదకి వెళ్లగా.. అఖిల్ కూడా పెద్ద గొంతుతో నటరాజ్ పై విరుచుకుపడిన ప్రోమో సోషల్ మీడియాలో హైలెట్ అవగా.. ఆ ఎపిసోడ్ ఈ రోజు రాత్రికి ప్రసారం కానుంది.