Advertisementt

KGF 3 పై కత్తిలాంటి అప్ డేట్

Sat 14th May 2022 04:48 PM
kgf 2,kgf 3,kgf chapter 2,kgf producer,salaar,rpabhas,prashanth neel  KGF 3 పై కత్తిలాంటి అప్ డేట్
Interesting update on KGF 3 KGF 3 పై కత్తిలాంటి అప్ డేట్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ చాప్టర్ 1 తో అంచనాలు లేకుండా కోట్లు కొల్లగొట్టుకుపోయిన ప్రశాంత్ నీల్ - యశ్ లు ఆ తరవాత దానికి సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్ చాప్టర్2 పై పెట్టుకున్న అంచనాలకు మించి కోట్ల వర్షం కురిపించారు. KGF 2 ఇప్పుడు ప్రతి భాషా ఆడియన్స్ మాట్లాడుకునే యాక్షన్ పాన్ ఇండియా ఫిలిం. ఏప్రిల్ 14న విడుదలైన కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా విడుదలైన అన్ని భాషల్లో 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ లో 400 కోట్లతో అక్కడి హీరోలకి చమటలుపట్టించిన కెజిఎఫ్ చాప్టర్ 2 ఇండియా వైడ్ గా 900 కోట్లు కొల్లగొట్టింది. అయితే కెజిఎఫ్ 2 తో అది ఇంకా పూర్తి కాలేదు.. దానికి సీక్వెల్ గా కెజిఎఫ్ 3 కూడా ఉంటుంది అనే అప్ డేట్ సినిమా రిలీజ్ అయినప్పుడే చెప్పారు.

అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ తో NTR31 సినిమాలు అయ్యాకే KGF 3 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ కెజిఎఫ్ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్‌ 3 సినిమా గురించి కత్తిలాంటి అప్ డేట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేయబోయే సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా 30-35 శాతంతో చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్-నవంబర్ నాటికి సలార్ చిత్రీకరణ పూర్తవుతుంది. ఆతర్వాత అక్టోబర్ లో KGF 3 షూటింగ్ మొదలవుతుంది అని, ఈ ఫ్రాంచైజీని మార్వెల్‌ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం అని, డాక్టర్ స్ట్రేంజ్ పోలో లేదా స్పైడర్‌మ్యాన్ హోమ్ కమింగ్ పోలో వంటి అనేక చిత్రాల మాదిరిగా అనేక పాత్రలను ఒకే సినిమాలోకి తీసుకురావడానికి ఈ చిత్రం సెట్ చేయబడింది.. అంటూ KGF 3 పై ఫాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు నిర్మాత విజయ్.

Interesting update on KGF 3 :

KGF 3 and Salaar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ