నటరాజ్ మాస్టర్ టాస్క్ ల్లో గెలిచి లక్కు లేక కొన్ని అవకాశాలు కోల్పోయి బిగ్ బాస్ హౌస్ లో నానా భీభత్సం చేసిన విషయం గత కొన్ని వారాలుగా చూస్తూనే ఉన్నాం. ఓట్ అప్పీల్ కోసం ఆడిన టాస్క్ లో నటరాజ్ లాస్ట్ వరకు వచ్చి ఇతరుల వల్ల ఓడిపోవడం, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లో గెలిచి మ్యాజిక్ బాక్స్ విషయంలో ఓడిపోవడం తో చాలా హార్ట్ అయ్యి ఎమోషనల్ గా ఇతర కంటెస్టెంట్స్ ని ఆడిపోసుకోవడమే కాదు, తన పాప కోసం గేమ్ ఆడుతున్నా, నన్ను చంపెయ్యి దేవుడా అంటూ చాలా అతి చేసాడు. అయితే గత రాత్రి ఓట్ అప్పీల్ అనిల్ కి రాగా.. నిన్నటి ఎపిసోడ్ లో అనసూయ ని ఇంప్రెస్స్ చేసి నటరాజ్ మాస్టర్ ఆ ఓట్ అప్పీల్ ని అందుకున్నాడు.
గత రాత్రి ఎపిసోడ్ లో ప్రతి ఎపిసోడ్ లో ఎవరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అనే విషయంలో శివ 15 మినిట్స్ తీసుకోగా, అఖిల్ 13 మినిట్స్ తీసుకున్నాడు. బిందు మాధవి 15 మినిట్స్ కోసం డిబేట్ చేసి ఆమెకి 15 మినిట్స్ ఇవ్వకపోయేసరికి ఆ గేమ్ ని వదిలేసింది. తర్వాత నటరాజ్ కి 11 మినిట్స్, ఆ తర్వాత అరియనకి 9 మినిట్స్ రాగా.. 5 మినిట్స్ మిత్ర కి, 1.5 మినిట్స్ బాబా, బిందు తీసుకున్నారు. అయితే టాప్ 4 లో ఉన్న శివ, నటరాజ్, అఖిల్, అరియనాలు వచ్చే గెస్ట్ ని ఇంప్రెస్స్ చేసి ఓట్ అప్పీలు గెలుచుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అనసూయ గెస్ట్ గా వచ్చేసరికి నటరాజ్ అమ్మాయి గెటప్ లో రెచ్చిపోయి డాన్స్ చేసాడు. అఖిల్ సాంగ్ పాడాడు. శివ అనిల్ హెల్ప్ తో స్కిట్ చేసాడు. ఫైనల్ గా అఖిల్, నటరాజ్ మాస్టర్ లు బాగా పెరఫార్మెన్స్ ఇచ్చారని, కానీ చివరికి నటరాజ్ కి అనసూయ ఇంప్రెస్స్ అయ్యి ఫ్లవర్ ఇవ్వడంతో నటరాజ్ ఆనందంగా ఓట్ అప్పీలు చెయ్యడం మానేసి .. నా పాప కోసం వచ్చాను, కష్టపడి ఆడాను నాకు ఓట్స్ వెయ్యండి అంటూ కళ్లనీళ్లు పెట్టేసుకుని ఎప్పటిలాగే అతి చేసాడు.