రామ్ చరణ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ కాగా.. మరొకటి తన తండ్రి చిరు తో కలిసి నటించిన మూవీ. అందులో పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, ఆ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పెరఫార్మెన్స్ కి విపరీతమైన ఆదరణ దక్కింది. చరణ్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా, లుక్ పరంగాను, పెరఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజుగా చరణ్ అదరగొట్టేసాడు. ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ నటించిన క్రేజీ మూవీ ట్రిపుల్ ఆర్ మే 20 న సౌత్ మొత్తంలో జీ 5 ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 50 డేస్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ ఓటిటి రిలీజ్ ఉండబోతుంది. ఇప్పటీకే అఫిషియల్ డేట్ తో పాటుగా, ఓటిటి ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
మరి రామ్ చరణ్ మరో మూవీ ఆచార్య కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. చిరు ఆచార్య గా చరణ్ సిద్ద గా నటించిన ఆచార్య ఏప్రిల్ 29 నే రిలీజ్ అయ్యింది. అంటే ఒకే రోజు రామ్ చరణ్ రెండు సినిమాలు ఓటిటిలో పోటీ పడుతున్నారు. అంటే రామ్ చరణ్ vs రామ్ చరణ్ అన్న మాదిరిగా అన్నమాట. అందులో ఒక సినిమా బ్లాక్ బస్టర్ కాగా మరొక సినిమా ప్లాప్ మూవీ. ఆచార్య మూవీకి ఆడియన్స్ ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ ఇవ్వడమే కాదు. ఆచార్య కలెక్షన్స్ కూడా డిసాస్టర్ కలెక్షన్స్ తెచ్చుకుంది. మరి ఒకే రోజు ఆచార్య, ట్రిపుల్ ఆర్ లు ఆయా ఓటిటీలలో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. కాకపోతే రెండు సినిమాల్లో రామ్ చరణ్ నటించడమే ఇక్కడ విశేషం.