మహానటి తో కీర్తి సురేష్ అవార్డులు రివార్డులు అందుకుంది. కానీ మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి ఆ టైటిల్ తప్ప మరేం మిగలలేదు. వరసగా కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అన్నీ ప్లాప్ అయ్యాయి. తర్వాత సోలో గా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేసింది.. వరసగా డిజాస్టర్స్ అయ్యాయి. రజినీకాంత్ కి చెల్లెలిగా పెద్దన్నలో నటించింది ఆ సినిమా పోయింది. అలాగే ఫిజిక్ విషయంలో నెటిజెన్స్ చేతిలో ట్రోల్ అయ్యింది. ఇక తాజాగా కీర్తి సురేష్ నటించిన చిన్ని మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అవగా.. కీర్తి సురేష్ మరోసారి మహానటిని గుర్తుకు తెచ్చింది అంటూ ప్రశంశలు అందుకునేలోపే.. కీర్తి సురేష్ మహేష్ బాబు తో కలిసి నటించిన సర్కారు వారి పాట థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.
ఆ సినిమాలో కీర్తి సురేష్ కళావతిగా కాస్త అందగానే కనబడినా.. ఆకతాయి అమ్మాయి కేరెక్టర్ కి మాత్రం సెట్ అవలేదు అనే విమర్శలు మూటగట్టుకుంది. కాస్త నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన కీర్తి సురేష్ పెరఫార్మెన్స్ బాగానే ఉన్న.. సెకండ్ హాఫ్ లో కీర్తి సురేష్ పాత్ర నిడివితో పాటు ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ లో మహేష్ తో కలిసి కామెడీ పండించిన కీర్తి సురేష్.. ఓవరాల్ గా బెస్ట్ అని చెప్పలేం కానీ.. పర్వాలేదనిపించింది. అయితే కీర్తి సురేష్ వలనే మహేష్ సినిమా దొబ్బింది, కీర్తి సురేష్ ఐరెన్ లెగ్ మహేష్ కి అంటుకుంది. లేదంటే సర్కారు వారి పాట హిట్టు. ఇప్పటివరకు కీర్తి సురేష్ నటించిన చాలా సినిమాలు డిసాస్టర్ అయ్యాయి.. మహానటి టు మహా టార్చెర్, మహా ఇరిటేటింగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. సర్కారు వారిపాటకు మిక్స్డ్ టాక్ అయినా పడింది.. లేదంటే కీర్తి సురేష్ కెరీర్ ఖతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.