బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అఖిల్ అండ్ బిందు మాధవి టైటిల్ ఫెవరేట్స్ గా మారడమే కాదు, వారిద్దరి మధ్యన పచ్చ గడ్డి వేసినా భగ్గుమనేంత గా పగ ఉంది. నామినేషన్స్ అప్పుడు ప్రతి వారం రివీల్ అవుతూనే ఉంది. బిందు మాధవి మీద అఖిల్, అఖిల్ మీద బిందు మాధవి తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అయిపోతే గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ కి హీరోలు, అలాగే తాజాగా యాంకర్ ఒకరు వచ్చారు. విశ్వక్ సేన్ హీరోయిన్స్ తో రాగా, శేఖర్ టీం రాజశేఖర్, జీవిత, అనూప్ రూబెన్స్ నిన్న ఎపిసోడ్ లోకి వచ్చారు. ఇక ఈ రోజు అనసూయ రావడం, రావడం సుయ సుయ సుయా అనసూయ అంటూ సందడిగా అడ్డుపెట్టి హౌస్ మేట్స్ తో డాన్స్ లు చేయించింది. నటరాజ్ మాస్టర్ అమ్మాయి గెటప్ వేసుకుని బాబా భాస్కర్ తో కలిసి డాన్స్ ఇరగదీసాడు.
ఇక అనసూయ లివింగ్ రూమ్ లో అందరిని కూర్చోబెట్టి.. హౌస్ మేట్స్ పై బయట సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ వినిపించింది. దానిలో మీ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చాక బిందు గెలవాలని విమెన్ కార్డు బయటికి తీసావ్ ఎందుకు అరియనా అని రాసిన కామెంట్ చదివింది అనసూయ. దానికి అరియనా ఆ సమాధానం మీకే వదిలేస్తున్నా అంది. తర్వాత బిందు ఇప్పటివరకు గ్రూప్ లోనే టాస్క్ ఆడావ్ మళ్ళి అఖిల్ గ్రూప్ గా ఆడుతున్నాడంటున్నావ్.. అనే కామెంట్ చదివింది. దానికి బిందు ఏదో చెప్పబోయే లోపు అఖిల్ నేను ఆడింది ఒక్కసారే.. అది నేను కాదు ఆడియన్స్ అడిగారు అనగానే బిందు ఫేస్ మాడిపోయింది.
తర్వాత అఖిల్ వెకేషన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్, ఫామిలీస్ వచ్చేవరకు బిందు తో తో విభేదాలు పెట్టుకున్నావు, కానీ మీ మదర్ వచ్చాక బిందు తో ప్యాచప్ చేసుకున్నావ్ ఎందుకు అనే కామెంట్ చదవగానే అఖిల్ మొహం మాడిపోయింది. ఇక ఏంటి శివా.. ఇప్పటివరకు కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగావు.. ఇప్పుడు అడిగించుకుంటున్నావ్ ఎలా ఉంది అనగానే హౌస్ మేట్స్ అందరూ నవ్వేసిన, బిందు, అఖిల్ పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కి వారు బాగా హార్ట్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.