ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకే ప్రేక్షకులు వచ్చే దిక్కు కనిపించడం లేదు. ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోవడానికి చాలా కారణాలు కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా కరోనా, అలాగే టికెట్ రేట్స్ పెంచెయ్యడం, అంతేకాకుండా రెండు వారాల్లో సినిమాలు ఓటిటి బాట పట్టడంతో ప్రేక్షకుల్లో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసి డబ్బులు వదిలించుకునే మోజు చాలావరకు తగ్గింది అని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే పెద్ద సినిమాలకు హిట్ టాక్ వస్తే.. రెండువారాలు ఎలాగోలా థియేటర్స్ లో నడుస్తున్నాయి.
కానీ చిన్న సినిమాల పరిస్థితి మాత్రం ఘోరంగా తయారైంది. చిన్న సినిమాని ఎన్నో కష్టాలు ఓడ్చి థియేటర్స్ లో రిలీజ్ చేసాక ప్లాప్ అయితే అది వేరే లెక్క.. హిట్ అయిన సినిమా కూడా ఒక్క వారానికి మూసుకోవాల్సి వస్తుంది. అలాగే చిన్న సినిమాలు మరీ తొందరగా అంటే నెలలోపే ఓటిటిలోకి రావడంతో ఆ సినిమాలని కూడా థియేటర్స్ కి వెళ్లి చూడాలా.. ఓటిటిలో వచ్చినప్పుడు చూద్దామంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. నిన్నగాక మొన్న వారం రిలీజ్ అయిన అశోక వనంలో అర్జున కళ్యాణమే తీసుకోండి.. ఆ సినిమా హిట్టే. కానీ ఆ సినిమాకి కలెక్షన్స్ పూర్. చిన్న సినిమా నా.. లేదా ఓటిటిలో వస్తుందిలే అనే ధీమాతోనే ప్రేక్షకులు పెద్దగా ఆ సినిమాని పట్టించుకోలేదు. అందుకే చిన్న సినిమాలు థియేటర్స్ లోకి ఇకపై రావడం కష్టమే అనిపిస్తుంది.