Advertisementt

పవన్ తో సినిమాని కన్ ఫర్మ్ చేసిన దర్శకుడు

Fri 13th May 2022 11:17 AM
samuthirakani,pawan kalyan,sai dharam,sai tej,pawan kalyan - samudrakhani  పవన్ తో సినిమాని కన్ ఫర్మ్ చేసిన దర్శకుడు
Samuthirakani spills the beans on his next with Pawan Kalyan పవన్ తో సినిమాని కన్ ఫర్మ్ చేసిన దర్శకుడు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వరస ప్రాజెక్ట్స్ తో ఫాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్స్ తో పవన్ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమాలకి విపరీతమైన హైప్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల హిట్స్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ జూన్ నుండి హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనున్నారు. తర్వాత సురేందర్ రెడ్డి మూవీ చేస్తారు.

అయితే పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి తమిళంలో హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని, దానికి సముద్రఖని దర్శకుడు అన్నారు. ఈ విషయంల ఎక్కడా అధికారిక ప్రకటన కూడా లేదు. అయితే తాజాగా సముద్రఖని సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాను అని, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని, ఆ ఫాన్ గా అలోచించి ఆయన్ని ఎలా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో అలా చూపించాలని అనుకుంటున్నట్టుగా సముద్రఖని చెప్పారు. అది కూడా తాను నటించి హిట్ అయిన తమిళ వినోదయ సిత్రం సినిమాను రీమేక్ చేయనున్నట్టు గా సముద్ర ఖని కన్ ఫర్మ్ చేసారు. మరి ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనేది ఆయన చెప్పలేదు.

Samuthirakani spills the beans on his next with Pawan Kalyan:

Samuthirakani reacts Pawan Kalyan movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ