Advertisementt

కమల్ విక్రమ్ లో కోలీవుడ్ స్టార్ హీరో

Fri 13th May 2022 10:42 AM
suriya,kamal haasan,vikram movie,vijay setupathy,fahad fasil  కమల్ విక్రమ్ లో కోలీవుడ్ స్టార్ హీరో
Kollywood star hero in Kamal Vikram కమల్ విక్రమ్ లో కోలీవుడ్ స్టార్ హీరో
Advertisement
Ads by CJ

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన విక్రమ్ మూవీ జూన్ 3 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, అలాగే ప్రమోషన్స్ లో టీం బిజీగా ఉండగా.. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో కలిసి హిందీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విక్రమ్ మూవీ పై భారీ క్రేజ్ అలాగే అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా.. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. విక్రమ్ గ్లిమ్ప్స్, అలాగే విక్రమ్ ఫస్ట్ సింగిల్ అన్ని అంచనాలకు మించి ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విక్రమ్ మూవీలో ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని, రీసెంట్ గా విక్రమ్‌ షూటింగ్‌ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్‌ హాసన్ సూర్య ని హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో చూసిన వారు సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసారని ఊహించుకుంటుంటున్నారు. మరి ఈ విషయమై విక్రమ్ టీం ఏం ప్రకటిస్తుందో చూడాలి.

Kollywood star hero in Kamal Vikram:

Suriya has acted in Kamal Haasan Vikram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ