బిగ్ బాస్ నాన్ స్టాప్ 11వ వారం నామినేషన్స్ లో హౌస్ లో ఉన్న ఎనిమిదిమంది ఉన్నారు. బాబా భాస్కర్, అఖిల్, బిందు మాధవి, నటరాజ్, అరియనా, మిత్ర శర్మ, అనిల్, శివ ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ ఉన్నవారిలో బాబా భాస్కర్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ వుంది. సో ఆయన టాప్ 5 కి వెళ్లడం ఖాయం. ఇక అఖిల్, బిందు, శివ కూడా టాప్ 5 కి ఆల్మోస్ట్ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నట్టే కనిపిస్తుంది వారికొచ్చే ఓట్స్ చూస్తుంటే. ఇక ఈ వారం బిందు తో గొడవ కారణంగా నటరాజ్ మాస్టర్ ఓటింగ్ లో కాస్త వెనుకబడ్డారు. అలాగే మిత్ర, అరియనా కూడా బెటర్ పొజిషన్ లోనే ఉన్నారు.
అయితే ఓటింగ్ లో ఒకరోజు అఖిల్, ఒకరోజు బిందు మాధవి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడంతో.. బిగ్ బాస్ టైటిల్ కూడా బిందు - అఖిల్ ఎవరో ఒకరికి పక్కా అనేది తేలిపోయింది. ఇక మూడో స్థానంలో యాంకర్ శివ ఉన్నాడు. మిత్రా శర్మ నాలుగో స్థానంలోనూ, ఆరియానా ఐదో స్థానంలోనూ ఉన్నారని తెలుస్తుంది. ఆరోస్థానంలో ఉన్న నటరాజ్ బిందు తో గొడవ కారణముగా ఓ స్థానం కింద పడిపోయారని, అనిల్ ఆరో ప్లేస్ లో, నటరాజ్ ఏదో ప్లేస్ లో తర్వాత బాబా కి ఎవిక్షన్ పాస్ ఉండడంతో పాటుగా ఆయనకి ఆడియన్స్ ని ఓట్ అడిగే ఛాన్స్ రావడంతో తక్కువ ఓట్స్ పోలైనట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా నటరాజ్, అనిల్, బాబా ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ.. బాబా ఎవిక్షన్ పాస్ కారణంగా నటరాజ్ - అనిల్ అలాగే అరియనా ఈ వారం బయటికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.