రెండు రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కి నిశ్చితార్ధం అయ్యినట్లుగా, ఆమె తన కాబోయే వాడిని చూపించకుండా చేతికి ఉన్న రింగ్ ని చూపిస్తూ షేర్ చేసిన పిక్ తో పాటుగా.. ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ పోస్ట్ చేసేసరికి సోనాక్షికి నిశ్చితార్ధం అయ్యింది, త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చేసాయి. ఆ పిక్స్ చూసిన అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసారు కూడా. అయితే సోనాక్షి తన ఎంగేజ్మెంట్ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.
ఓకె నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించాను అనుకుంటున్నాను. నేను ఎలాంటి అబద్దం చెప్పకుండా, మీకు చాలా క్లూస్ ఇచ్చాను. అవును నేను చెప్పినట్లుగా ఆ రోజు నాకు నిజంగా బిగ్‌డే.. ఆ రోజు నేను నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీని ప్రారంభించే రోజు. అందమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి నైల్ పాలిషే చివరి గమ్యం అవుతుంది. నేను బిజినెస్ లోకి అడుగుపెట్టి నా కలను నిజం చేసుకున్నాను. సోయిజీ నెయిల్ పాలిష్ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను మీతో షేర్ చేసుకున్నాను.. మీరేం ఊహించుకున్నారో.. లవ్ యూ గాయ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్ అంటూ షేర్ చేసేసరికి.. నెటిజెన్స్ కి సోనాక్షిపై విపరీతమైన కోపం వచ్చేసింది.. మరీ ఇంతలా చీట్ చెయ్యాలా నీ వ్యాపారాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే అంటూ సోనాక్షి పై మండిపడుతున్నారు.