బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఫిబ్రవరిలో మొదలైన NBK107 షూటింగ్ ఇప్పటికి 40 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య డ్యూయెల్ రోల్ లో రెండు డిఫ్రెంట్ షేడ్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ NBK107 ఫస్ట్ లుక్ విపరీతంగా పాపులర్ అయ్యింది. బ్లాక్ షర్ట్, లుంగీ కట్టులో బాలయ్య అదరగొట్టేసాడు. ఒక కేరెక్టర్ ని స్టైలిష్ గా డిజైన్ చేసిన గోపీచంద్ మరో కేరెక్టర్ ని మాస్ గా పవర్ ఫుల్ గా డిజైన్ చేసారని తెలుస్తుంది. ఆ స్టైలిష్ పాత్రకే శృతి హాసన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. అయితే NBK 107 తాజా షెడ్యూల్.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతుంది.
ఈ కీలక షెడ్యూల్ లో రామ్ లక్షణ్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్స్ లో బాలయ్య అలాగే విలన్ పాత్రధారి దునియా విజయ్ పాల్గొంటున్నారని, ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుంది అని, అందుకే బాలయ్య ఇమేజ్ కి సరిపోయే పోరాట ఘట్టాలను రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రెండు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించిన గోపీచంద్ ఇప్పుడు మూడో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారట. ఇక సినిమాలో ఓ కీలక షెడ్యూల్ కోసం టీం త్వరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.