బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ముగియడానికి మరొక్క పది రోజులు మాత్రమే టైం ఉంది. ఈలోపు సినిమా ప్రమోషన్స్ కోసం చాలామంది హీరోలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా అశోక వనంలో అర్జున కళ్యాణం తో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ తన హీరోయిన్స్ తో కలిసి హౌస్ లోకి ఎంటర్ అయ్యి బిగ్ బాస్ లో తన సినిమా ప్రమోట్ చేసుకున్నాడు. అలాగే హౌస్ మేట్స్ తో సరదాగా కామెడీ చేసారు. ఇక ఈ రోజు రాజశేఖర్ తన భార్య జీవిత తో కలిసి బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కూడా వచ్చారు.
శేఖర్ మూవీ ఈ నెల 20 న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అరియానా, బాబా భాస్కర్, మిత్ర శర్మ తమ కామెడీతో శేఖర్ టీమ్ ని ఇంప్రెస్స్ చేసారు. బిందు, శివ స్కిట్ తో ఆకట్టుకున్నారు. ఇక బాబా భాస్కర్ రాజశేఖర్ తో డాన్స్ కూడా చేయించారు. శేఖర్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన హీరో రాజశేఖర్, డైరెక్టర్ జీవిత, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో సరదాగా గడిపిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోతుంది.