ఎన్టీఆర్ బర్త్ డే కి RRR స్పెషల్ ట్రీట్

RRR OTT streaming date locked

ఎన్టీఆర్ బర్త్ డే మే 20. ఎప్పుడో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ నుండి మళ్ళీ ఎన్టీఆర్ కి కొత్తగా ట్రీట్ ఇవ్వడమేమిటి అనుకుంటున్నారేమో.. ఇప్పటివరకు ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసారు, ఆ సినిమాలో హైలెట్ అయిన వీడియో సాంగ్స్ చూస్తున్నారు. కానీ ట్రిపుల్ ఆర్ ఎప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందో అనే ప్రశ్నకి నిన్నటివరకు సమాధానం దొరకనివ్వలేదు. సినిమా రిలీజ్ అయ్యింది మార్చి 25. అంటే ఇప్పటికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి 45 రోజులు గడుస్తున్నా.. ఆ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. థియేటర్స్ లో చూసిన, చూడని వారు కూడా మరోసారి ఓటిటిలో వీక్షించేందుకు రెడీ అయినా.. మేకర్స్ మాత్రం ఓటిటి విషయంలో చాలా సీక్రెట్ ని మెయింటింగ్ చేస్తూ వచ్చారు. చివరికి ట్రిపుల్ ఆర్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసారు.

అఫీషియల్ గా ట్రిపుల్ ఆర్ సౌత్ లో జీ5 OTT మే 20 అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అనుకోని ఓటిటి ట్రీట్ ఎన్టీఆర్ ఫాన్స్ కి అలా అందుతుంది. మరి కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ పెరఫార్మెన్స్, యాక్షన్ విన్యాసాలు అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఆ సినిమాని మళ్ళీ మళ్లీ చూడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ తో పాటుగా ట్రిపుల్ ఆర్ ఓటిటి సెలెబ్రేషన్స్ కూడా ఉండబోతున్నాయన్నమాట.

RRR on ZEE5 from May 20!

rrr
rrr on zee5 from may 20
zee5 ott
ram charan
ntr
rajamouli