ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Disaster SVP hashtag trends on twitter

DisasterSVP అంటూ నెగిటివిటి స్ప్రెడ్

Disaster SVP hashtag trends on twitter

మహేష్ బాబు నటించిన్ సర్కారు వారి పాట మరికొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మహేష్ బాబు ఫాన్స్ క్రేజీగా రెండున్నరేళ్లుగా మహేష్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనే కోరికతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఓవర్సీస్ లో సర్కారు వారి పాట షోస్ ఈ రోజు ఉదయం 12 గంటల నుండే మొదలైపోయాయి. అక్కడ సర్కారు వారి పాటని వీక్షిస్తూ ఆడియన్స్ లైవ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు సాగిన సర్కారు వారి పాట ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంది అంటూ కొంతమంది అప్ డేట్స్ ఇస్తుంటే.. మరికొంతమంది #DisasterSVP ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు.

మహేష్ కి మరో డిసాస్టర్ పడింది అంటూ మహేష్ యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో #DisasterSVP హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు. యుఎస్ ప్రీమియర్స్ చూసాక.. డిసాస్టర్ SVP అంటున్నారు. టైం వేస్ట్ మూవీ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోండి అని, ఈ సినిమా ఓటిటి లో చూసుకోవడం బెటర్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ వెరీ వెరీ పూర్ అంటూ #DisasterSVP హాష్ టాగ్ తో హల్ చల్ చేస్తున్నారు. కానీ సినిమా పూర్తిగా చూడకుండానే ఇలాంటి హాష్ టాగ్స్ ట్రెండ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్.

Sarkaru Vaari Paata Live updates

sarkaru vaari paata
sarkaru vaari paata live updates
mahesh babu
keerthy suresh
parasuram