మహేష్ ఫాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. మరికొద్ది గంటల్లో యుఎస్ ప్రీమియర్స్ అంటూ ఓవర్సీస్ లో మహేష్ ఫాన్స్ హడావిడి మొదలు పెట్టేసారు. మరోపక్క హైదరాబాద్ సిటీలో ఉదయం 4 గంటలకే బెన్ఫిట్ షోస్ పడుతున్నాయి. భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాధ్, శ్రీ రాములు థియేటర్స్ లో రేపు తెల్లవారి ఝామునే స్పెషల్ షోస్ కి టీఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. దాంతో మహేష్ ఫాన్స్ ఆ థియేటర్స్ దగ్గర రచ్చ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇక సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ అంటూ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తన ట్విట్టర్లో ఈ సినిమాకి రివ్యూ ఇచ్చేసాడు.
సర్కారు వారి పాటలో మహేష్ బాబు వన్ మ్యాన్ షోస్ చేసారని, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అని, మహేష్ ని చూసిన ప్రతిసారి ఆయన ఫాన్స్ థియేటర్స్ లో రచ్చ చెయ్యడం ఖాయమని, మహేష్ సింహం లా చెలరేగిపోయాడని, యాంగ్రీ లుక్ తో మహేష్ అరిపించేసాడని, మహేష్ కామెడిగా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయని, మహేష్ పెరఫార్మెన్స్ కి మాస్ ఆడియన్స్ కి పూనకాలు రావడం ఖాయమని, కీర్తి సురేష్ కళావతిగా అందంగా కనిపించింది అని, మహేష్ - కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని, ఇంత మంచి సినిమాని హిందీ లో కూడా రిలీజ్ చేసి ఉంటే.. అద్భుతమైన హిట్ కొట్టేది అంటూ ఉమైర్ సంధు సర్కారు వారి పాట గురించి ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చెయ్యడంతో మహేష్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.