గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ నామినేషన్స్ అంటూ టాప్ 5 లో ఉండకూడని ముగ్గురిని ఎంపిక చెయ్యమని బిగ్ బాస్ చెప్పడంతో.. ఎవరికి వారే రెచ్చిపోయి నామినేట్ చేసుకున్నారు. అందులో అఖిల్ - బిందు మాధవి, నటరాజ్- బిందు మధ్యలో మధ్యలో హోరా హోరి ఫైట్ జరిగింది. బిందు మాధవికి గేమ్ మీద ఫోకస్ లేదు, ఆమె పిఆర్ టీం ఆమెని గెలిపించడానికి సోషల్ మీడియాని ఉపయోగిస్తుంది, ఇక్కడ గెలుస్తుంది చెన్నై వెళ్ళిపోతుంది అంటూ నటరాజ్ ఘాటైన వ్యాఖ్యలు చెయ్యగా.. బిందు మాధవి మాత్రం నటరాజ్ పై రెచ్చిపోయి మహంకాళిలా మారిపోయింది. అసలు ఈ రెండు రోజుల నామినేషన్స్ ఇంట్రెస్ట్ ని కలిగించక పోగా.. జనాలకు చిరాకు తెప్పించాయి.
ఇక సోషల్ మీడియాలో బిందు మాధవిని నటరాజ్ ఫాన్స్ ఏకి పారేస్తున్నారు. నటరాజ్ టాస్క్ లో పులిలా, సింహంలా ఆడతాడు అని, బిందు మాధవి గేమ్ ఆడకుండా సొల్లు చెబుతుంది అని, ఎదో ఆడపులి టాగ్ తగిలించేసుంటే సరిపోతుందా, నటరాజ్ నామినేషన్స్ లో మాట్లాడుతుంటే బిందు ఉమ్మెయ్యడం ఏమిటి.. అంటూ బిందు మాధవిని ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క బిందు మాధవి ఫాన్స్ ఆమెని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ నటరాజ్ మాస్టర్ పై విరుచుకు పడుతున్నారు. అమ్మాయిలని గౌరవించడం మాస్టర్ నేర్చుకోవాలని, ఒక అమ్మాయిపై గుంపుగా పడడం, నోరేసుకుని పడడం ఏమిటి అంటూ ఆమె ఫాన్స్ నటరాజ్ మాస్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నటరాజ్ vs బిందు మాధవి అన్న రేంజ్ లో గొడవ జరుగుతుంది.