కరోనా పాండమిక్ సిట్యువేషన్ ముగిసింది. భారీ సినిమాలు, పాన్ ఇండియా ఫిలిమ్స్ వరసగా బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. ఆడియన్స్ మెల్లగా థియేటర్స్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ పెద్ద సినిమాలకి అసలు ఓపెనింగ్స్ రావడం లేదు. అందులో ఈ మధ్యన రిలీజ్ అయిన ఆచార్య మూవీకి మరీ ఘోరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా మొదటి రోజు టాక్ చూసి రెండో రోజు కలెక్షన్స్ తగ్గడం వేరు. కానీ ఆచార్య రిలీజ్ కి ముందే క్రేజ్, హైప్ కానీ కనిపించలేదు. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రామ్ చరణ్ మూవీ అన్నా ఫాన్స్ లోనూ ఇంట్రెస్ట్ కనిపించలేదు. చిరు -చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు అన్నా ఆచార్యకి ఓపెనింగ్స్ పడలేదు.
ఇప్పుడు అల్లు అరవింద్ కూడా అదే చెబుతున్నారు. రీసెంట్ గా ఆయన అశోక వనంలో అర్జున కళ్యాణం సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఆడియన్స్ మనస్తత్వం మారింది అని, థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ తగ్గింది అని, వీకెండ్ వస్తే తనను సినిమాకి తీసుకువెళ్ళమని పిల్లలు, భార్యలు భర్తలను అడిగే వాళ్ళని, కానీ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆదివారం నాడు ఓటిటిలో ఏ సినిమా వస్తుందో అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మరోపక్క హిందీ సినిమా పరిశ్రమ కూడా బాగోలేదు అని, స్టార్స్ సినిమాలకే కనీస ఓపెనింగ్స్ రావడం లేదు అని, ఇలానే ఉంటే ఇండస్ట్రీ ప్రమాదంలో పడినట్లే అని, సినిమా పరిశ్రమలో ఉన్నవారంతా విభేదాలు పక్కనబెట్టి కలిసి పని చెయ్యాలంటూ చెప్పారు అరవింద్.
నిజమే అల్లు అరవింద్ చెప్పింది అక్షరాలా నిజం. అది ఆచార్య తోనే నిరూపితమైంది. ఆడియన్స్ సినిమా చూసే కోణంలో ఎంతగా మార్పు వచ్చిందో అనేది.