Advertisementt

సర్కారు వారి పాటకి క్రేజీ బుకింగ్స్

Wed 11th May 2022 03:14 PM
mahesh babu,sarkaru vaari pata,svp,parasuram,keerthy suresh  సర్కారు వారి పాటకి క్రేజీ బుకింగ్స్
SVP to get a thunderous start సర్కారు వారి పాటకి క్రేజీ బుకింగ్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు రెండున్నరేళ్ల తర్వాత సర్కారు వారి పాటతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సర్కారు వారి పాట ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన టీం.. ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక సర్కారు వారి పాటకి అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ పెంపుకు ప్రభుత్వ అనుమతులు లభించేసాయి. మరోపక్క బుక్ మై షో లో సర్కారు వారి పాట బుకింగ్స్ ఓపెన్ అవడమే కాదు, హైదరాబాద్ లో రికార్డ్ రేంజ్ లో టికెట్స్ తెగుతున్నాయి.

రేపు గురువారం హైద్రాబాద్‌లో దాదాపు అన్ని షోలు బుక్ అయిపోయాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే అన్నీ హౌస్ ఫుల్ అయినట్టు చూపిస్తున్నాయి. అయితే సర్కారు వారి పాట ఇదే జోరు ఈ వీకెండ్ వరకు కంటిన్యూ అయితే సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రాబోతున్న సర్కారు వారి పాట బిసి సెంటర్స్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. సర్కారు వారి పాట అడ్వాన్స్ బుకింగ్ లోనే మొదట రోజు హైద్రాబాద్‌లో దాదాపు 6.6కోట్ల వరకు కొల్లగొట్టేసినట్టుగా తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ సినిమా మొదటి రోజు పది కోట్లకు పైగానే రాబట్టేసింది. ఇప్పుడు ఆ క్రేజ్ మళ్లీ సర్కారు వారి పాట బుకింగ్స్ లో కనబడుతుంది అంటున్నారు.

SVP to get a thunderous start:

Sarkaru vaari paata to get a thunderous start

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ