Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో అల్లం అర్జున్

Wed 11th May 2022 02:02 PM
vishwak sen,ashoka vanamlo arjuna kalyanam,ruhani sharma,bigg boss non stop,bigg boss ott  బిగ్ బాస్ హౌస్ లో అల్లం అర్జున్
Vishwak sen enters the Bigg Boss non stop house బిగ్ బాస్ హౌస్ లో అల్లం అర్జున్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. బిగ్ బాస్ ఓటిటి ఆఖరి అంకానికి చేరుకుంది. కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది.. అందులో ఓ మూడు రోజులు ఫినిష్ కూడా అయ్యింది. ఈ వారం ఎనిమిది మందిలో అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఫైనల్ వీక్ లో ఫైనల్ గా ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది ఈ వారం తేలిపోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ నుండి టాలీవుడ్ హీరోస్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. క్రేజీ గా అందరికి దగ్గరైన బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే సినిమా హిట్ అని నమ్ముతున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అల్లం అర్జున్ తన హీరోయిన్స్ తో అడుగుపెట్టాడు. రీసెంట్ గా అశోక వనంలో అర్జున కళ్యాణం తో హిట్ కొట్టిన విశ్వక్ సేన్.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసాడు.

విశ్వక్ సేన్ రుహని శర్మ, అర్జున్ కళ్యాణం లో సెకండ్ హీరోయిన్ మూగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవగానే.. అందరిని హాగ్ చేసుకుని.. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం రాలేదు, సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టాక వచ్చాను అన్నాడు. తర్వాత బిగ్ బాస్.. విశ్వక్ సేన్ అనగానే విశ్వక్ సేన్ అలా ఉండిపోయాడు. మీకు వెల్ కం అనగానే ఇంకా నయం ఏదైనా తప్పు చేశాను అంటారేమో అనుకున్నా అన్నాడు. తర్వాత హౌస్ మేట్స్ ని లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి ఫన్నీ ప్రశ్నలు వేశారు. మీ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ వేరే వాళ్ళని గోకితే మీరేం చేస్తారనగానే అరియనా వాడిని చీపురు కట్ట తో కొడతా అంది. నటరాజ్ మాస్టర్ నేను ఓ మెసేజ్ తో మా ఆవిడకి దొరికిపోయా అన్నాడు. తర్వాత విశ్వక్ సేన్ హౌస్ మేట్స్ తో కలిసి డాన్స్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ ని సందడిగా మార్చేశాడు

Vishwak sen enters the Bigg Boss non stop house:

Vishwak sen and Ashoka Vanamlo Arjuna Kalyanam Heroine enters the Bigg Boss non stop house

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ