రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్నారు. అక్కడ RC 15 కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. గత వారం రోజులుగా చరణ్ వైజాగ్ లోనే ఉంటున్నారు. అయితే ఆయన భార్య ఉపాసన కోవిడ్ బారిన పడి కోలుకున్నట్లుగా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తనకి కరోనా సోకింది అని, వ్యాక్సిన్ తీసుకోవడం వలన స్వల్ప లక్షణాలతో బాధపడ్డాను అని, డాక్టర్స్ సలహా మేరకు పారాసిటమాల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే తీసుకున్నాను అని ఉపాసన తెలియజేసింది.
అయితే తాను తన ఫ్యామిలీ మెంబెర్స్ ని కలవడానికి చెన్నై వెళ్లే ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఆమె తెలిపారు. ప్రస్తుతం కరోనా నుండి కోలుకుని.. విశ్రాంతి తీసుకుంటూనే లైఫ్ ని యధావిధిగా స్టార్ట్ చేస్తున్నాను.. కరోనా నుండి కోలుకున్నాక శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నాను. కోవిడ్ మళ్లీ విజృంభిస్తుంది అని చెప్పలేం కానీ, మనం మాస్క్, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుండి కాపాడుకున్నట్టే అంటూ ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.