సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ఛాన్సెస్ తగ్గడంతో ఈమధ్యన విమర్శలు మొదలు పెట్టారు. గతంలో పర భాషా నటులకి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గొడవ చేసిన కోట.. ఇప్పుడు మెగాస్టార్ చిరు చేస్తున్న మంచి పనులని వేలెత్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు స్కూల్, హాస్పిటల్ కట్టడం వలన ఉపయోగం లేదు, కృష్ణానగర్ లో ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టమని అన్నారు. ఇప్పుడేమో రామ్ చరణ్ నటన బాగోదు అంటూ స్ట్రయిట్ కామెంట్స్ చేసి మెగా ఫాన్స్ చేతిలో తిట్లు తింటున్నారు.
అయితే ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ... అందరిలో బెస్ట్ మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని, నవరసాలు పండించడంతో ఎన్టీఆర్ దిట్ట అని, ఆయనకు ఎవరూ సాటిరారు అని, ఎన్టీఆర్ ని ఈ విషయంలో బీట్ చేసే దమ్ము ఏ హీరో కి లేదని అన్న కోటా.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ ఉన్నా సరే వారిని మించి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని.. అందుకే ఎన్టీఆర్ లాంటి నటుడు తెలుగులో మరెవరూ లేరంటూ కోట శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేసారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీముడా సాంగ్ లో ఇచ్చిన పెరఫార్మెన్స్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులు ఇంప్రెస్స్ అవుతున్న విషయం తెలిసిందే.