అల్లు అర్జున్ - సుకుమార్ కలిసి పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప ద రైజ్ అంటూ భారీ హిట్ కొట్టారు. పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప లుక్ కి, ఆయన పెరఫార్మెన్స్ కి అందరూ ఇంప్రెస్స్ అయ్యారు. బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఆయనతో ఎప్పుడెప్పుడు నటిద్దామా అనే ఆరాటంలో ఉన్నారు. అందుకే పార్ట్ 2 గా రాబోతున్న పుష్ప ద రూల్ పై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ తన పీఠాన్ని ఎలా కాపాడుకున్నాడు, భన్వర్ లాల్ ఫహద్ ఫాసిల్ తో యుద్ధం ఎలా చేసాడో చూపించబోతున్నారట. సెకండ్ పార్ట్ అంతా యాక్షన్ సీక్వెన్స్ తోనే లేపాలని సుకుమార్ చూస్తున్నారట.
ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా హాలీవుడ్ స్టయిల్లో ఉండాలని అందుకే ఎంత ఖర్చయినా వెనకాడవద్దని నిర్మాతలు కూడా చెప్పడంతో పుష్ప ద రూల్ కోసం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. బాలీవుడ్ నుండి పేరున్న నటులను, అలాగే యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీ వుడ్ ఫైట్ మాస్టర్స్ ని, ఫారెస్ట్ ఫైట్ కోసం భారీగా ఖర్చు పెట్టడంతో పుష్ప ద రూల్ బడ్జెట్ పెరిగింది అని, అలాగే అల్లు అర్జున్, సుకుమార్ పారితోషకాలు కూడా పెరగడంతోనే 400 కోట్ల ఫిగర్ పుష్ప ద రూల్ కి ఎక్కుతుంది అని అంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ కి మరో హీరోయిన్ తోడవ్వబోతుంది అని అది బాలీవుడ్ నుండే ఉండబోతుంది అంటున్నారు. ఈ జూన్ లో పుష్ప ద రూల్ షూటింగ్ మొదలై వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా సినిమాని రెడీ చేయాలని చూస్తున్నారట.