బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ పూర్తి కావడానికి ఎంతో సమయం లేదు. మరొక్క వారమే గ్యాప్ ఉంది. రేపు ఆదివారం కాకుండా వచ్చే ఆదివారమే బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే తో ముగియబోతుంది. ఈ వారం ఏ ముగ్గురు టాప్ 5 లో ఉండేందుకు అర్హులు కారో చెప్పమన్నప్పుడు.. హౌస్ లో పెద్ద యుద్ధమే నడిచింది. టైటిల్ ఫెవరెట్స్ అఖిల్ vs బిందు మాధవి అన్నట్టుగా సాగిన ఈ నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ అలాగే బిందు మాధవికి మధ్యన పెద్ద గొడవ జరిగింది. ఇక అందరూ మిత్రా.. బిందూని టార్గెట్ చేస్తుంది అనుకుంటే.. అనూహ్యంగా తనకి సపోర్ట్ చేసిన బాబా భాస్కర్ టాప్ 5 కి అర్హులు కారు అనేసింది. అరియనా కి మిత్రా కి బాగా గొడవ జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నేరుగా అందరూ నామినేట్ అయ్యారు అనగానే.. గత రెండు రోజులుగా నామినేషన్స్ అంటూ హౌస్ సభ్యుల మధ్యన గొడవ పెట్టి మరీ బిగ్ బాస్ కావాల్సిన ఫుటేజ్ లాక్కున్నాడని అనిపించింది.
ఈ వారం బాబా భాస్కర్, బిందు మాధవి, నటరాజ్, అఖిల్, మిత్ర, శివ, అరియనా, అనిల్ ఇలా హౌస్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్స్ కి వెళ్లగా.. బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడంతో ఆయన టాప్ 5 కి వెళ్లే అవకాశం ఉంది. ఇక మిగిలిన వారిలో ఎవరు టాప్ 5 కి వెళతారు, ఎవరు ఇంట్లోనుండి ఒక వారం ముందే వెళతారనే దాని మీద అందరిలో ఇంట్రెస్ట్ మొదలైతే.. హౌస్ మేట్స్ మధ్యన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అఖిల్, బిందు, శివ సేఫ్ గానే ఉన్నా.. మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఎవరు టాప్ 5 కి వెళతారో చూడాలి.