Advertisementt

మహేష్-రాజమౌళి: అదిరిపోయే అప్ డేట్

Tue 10th May 2022 08:59 PM
mahesh,rajamouli,mahesh - rajamouli movie,vijayendra prasad,mahesh babu,sarkaru vaari paata,mahesh - trivikram combo  మహేష్-రాజమౌళి: అదిరిపోయే అప్ డేట్
Interesting update on Mahesh - Rajamouli movie మహేష్-రాజమౌళి: అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. అటు ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇవ్వడం, ఇటు మీడియా తో ఇంటరాక్ట్ అవ్వడం వంటి పనులతో బిజీగా వున్నారు. రేపు గురువారం సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంటే.. ఓ 15 రోజుల గ్యాప్ లో అంటే  జూన్ నుండి త్రివిక్రమ్ మూవీ ని మహేష్ మొదలు పెట్టబోతున్నట్టుగా ఆయనే అప్ డేట్ ఇచ్చారు. అయితే ఒన్స్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయితే మహేష్ బిజీ అవుతారు. అప్పుడు రాజమౌళి మూవీ కోసం మహేష్ ఎప్పుడు రెడీ అవుతారు.. అటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత మహేష్ స్క్రిప్ట్ లోనే బిజీగా వుంటాను, ఈ ఏడాది చివరి నుండి మహేష్ తో మూవీ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. 

తాజాగా మహేష్ - రాజమౌళి కలయికకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ మహేష్ - రాజమౌళి మూవీ పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ కోసం కథ రెడీ చేస్తున్నాం, స్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఫారెస్ట్ నేపథ్యంలో మహేష్ - రాజమౌళి కాంబో కథ సాగుతుంది. ఈ ఏడాది మహేష్ త్రివిక్రమ్ మూవీ తో బిజీగా వుంటారు. వచ్చే ఏడాది మొదట్లో రాజమౌళి - మహేష్ మూవీ మొదలవుతుంది అని ఆయన చెప్పారు.

మరోపక్క రాజమౌళి తో వర్క్ చేసేందుకు ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లుగా మహేష్ చెప్పడమే కాదు, తాను ఫస్ట్ టైం రాజమౌళితో కలిసి పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన మీడియా మీట్లో మహేష్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు చేస్తారు అనగానే.. నేను, రాజమౌళి గారు చేస్తే పాన్ ఇండియా కాకుండా ఎలా వుంటుంది.. అంటూ మహేష్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే.

Interesting update on Mahesh - Rajamouli movie :

Mahesh - Rajamouli movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ