నాగ చైతన్య నాగార్జున - అమలకి పుట్టిన కొడుకు కాదు. నాగార్జున - దగ్గుబాటి లక్ష్మి ల కొడుకు. అమలకి - నాగార్జునకి పుట్టిన కొడుకు అఖిల్. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే నాగ చైతన్య విషయంలో ఎప్పుడూ పెద్దగా స్పందించని అమల తాజాగా నాగ చైతన్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య తల్లితండ్రులు విడిపోవడంతో.. తన తల్లి లక్ష్మి దగ్గరే చెన్నై లో పెరిగాడని, హాలిడేస్ లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు తండ్రి నాగ్ తో ఎక్కువగా సమయం గడిపేవాడిని అమల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
చైతన్యని నేను పెంచలేదు. తన తల్లి లక్ష్మి దగ్గరే పెరిగాడు. ఆమె నాగ చైతన్యని చాలా పద్దతిగా పెంచారు అని, రెండు మూడు నెలలకి ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తండ్రి నాగార్జున తో ఎక్కువ సమయం గడిపేవాడిని.. నాగ్ తో ఎక్కువగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాడని, అలాగే అఖిల్ అన్నా అన్నా అంటూ చైతూ చుట్టూ తిరిగేవాడని, చైతు వచ్చినపపుడు అఖిల్ కి అమ్మ కూడా అక్కర్లేదు అని, ఇద్దరూ కలిసి బాగా ఆడుకునేవారని, అఖిల్ హైపర్ యాక్టీవ్ గా ఉంటే.. నాగ చైతన్య కామ్ గా సైలెంట్ గా ఉండేవాడు అంటూ నాగ చైతన్య పై అమల ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.