Advertisementt

ప్రభాస్ అభిమాని సూసైడ్ లెటర్

Tue 10th May 2022 05:21 PM
prabhas,prabhas fa,suicide latter,salaar update,prashanth neel  ప్రభాస్ అభిమాని సూసైడ్ లెటర్
Prabhas fan wrote a suicide letter to Prashant Neel ప్రభాస్ అభిమాని సూసైడ్ లెటర్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరో ఫాన్స్ అయినా చాలా విషయాల్లో డిఫ్రెంట్ గా బిహేవ్ చేస్తారు. హీరోల విషయంలో చాలా అభిమానంతో ఉంటారు. కొన్ని కొన్నిసార్లు ప్రాణాలకు సైతం లెక్కచేయరు. ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ కి నెగెటివ్ టాక్ వచ్చిన కారణంగా ఓ అభిమాని సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఇక తాజాగా ప్రభాస్ ఫాన్స్ సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని బెదిరిస్తున్నారు. ఈ నెలలోనే ప్రభాస్ సలార్ కొత్త షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. అలాగే చివరి వారంలో సలార్ టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి మే వచ్చేసినా ఇంకా సలార్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

దానితో ప్రభాస్ అభిమాని ఒకరు ప్రశాంత్ నీల్ కి ఓ సూసైడ్ లెటర్ రాసాడు. సలార్ అప్ డేట్ ఇవ్వకపోతే చనిపోతాను అంటూ సూసైడ్ లెటర్ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రశాంత్ నీల్ మే నెలలో సలార్ నుండి టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. రాధే శ్యామ్, సాహో మేకర్స్ ఇలానే అప్ డేట్స్ ఇవ్వకుండా మమ్మల్ని బాధపెట్టారు. ఇప్పుడు అదే సలార్ విషయంలోనూ రిపీట్ అవుతుందేమో అని భయపడుతున్నాం అందుకే మీకు ఈ లెటర్ రాస్తున్నా అంటూ ప్రభాస్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్ కి సూసైడ్ లెటర్ రాయడమే కాదు, ఈ మే నెలలో గనక అప్ డేట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా సూయిసైడ్ చేసుకుంటాను అంటూ బెదిరిస్తున్నాడు. ప్రభాస్ అభిమాని రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాబోయ్ ప్రభాస్ ఫాన్స్ మరీ వైల్డ్ గా ఉన్నారంటూ నెటిజెన్స్ స్పందిస్తున్నారు.

Prabhas fan wrote a suicide letter to Prashant Neel :

Prabhas fan pens a suicide note over Salaar update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ