రామ్ చరణ్ - శంకర్ కలయికలో తెరకెక్కుతున్న RC 15 మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ వైజాగ్ బీచ్, మధురవాడ పోలీస్ స్టేషన్ అంటూ శంకర్ చిత్రీకరణలో బిజీగా వున్నారు. వైజాగ్ లో ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు భారీ బడ్జెట్ పెడుతున్నారు.
అయితే ఇప్పటికే RC 15 లో ఓ సాంగ్ కోసం కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టారనే న్యూస్ ఈ సినిమా స్టార్టింగ్ టైం లోనే వినిపించింది. ఇక ఇప్పుడు మరో సాంగ్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేసారని, అందులో చరణ్ డాన్స్ స్టెప్స్ అదిరిపోతాయని, జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఆ సాంగ్ రూపుదిద్దుకుంటుంది అని, ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ చేసిన డాన్స్ కి మించి RC 15 లో ఈ సాంగ్ లో చరణ్ డాన్స్ ఉండబోతుంది అంటున్నారు. ఈ సాంగ్ సినిమాలో ఓ హైలెట్ గా నిలవబోతుంది అని, అలాగే ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్ కూడా వేశారని తెలుస్తుంది.