Advertisementt

వైరల్: కూతురు సితార పై మహేష్ కామెంట్స్

Tue 10th May 2022 10:52 AM
mahesh babu,daughter sitara,sitara ghattamaneni,sakaru vaari paata,penny promotional song  వైరల్: కూతురు సితార పై మహేష్ కామెంట్స్
Mahesh Babu comments on Sitara వైరల్: కూతురు సితార పై మహేష్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ ఫ్యామిలీ మ్యాన్ గా, నిర్మాతల హీరోగా ఎప్పుడు టాప్ లోనే ఉంటారు. మహేష్ నటించిన సర్కారు వారి పాట రేపు గురువారమే విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బిజీగా వున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన కూతురు సితార గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సితార అంటే ఇప్పుడు మహేష్ బాబు కూతురు అనడం లేదు, సెలెబ్రిటీ కిడ్ కాదు, సితార కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాన్స్ ఉన్నారు. 

సితారకి డాన్స్ అన్నా, డ్రాయింగ్ అన్నా చాలా ఇష్టం, సర్కారు వారి పాట ప్రమోషనల్ సాంగ్ లో సితార డాన్స్ ఇరగదీసేసింది. అయితే సర్కారు వారి పాట సాంగ్ లో సితార ప్రమోషనల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది థమన్ కి అంటూ చెప్పారు మహేష్. ఆయనే ముందు నమ్రతని ఒప్పించేసారు. నేను నమ్రతని అడిగేలోపే ఆ డాన్స్ చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. సితార డాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. సితారని చూసి గర్వపడతాను. అయితే ఈ సాంగ్ కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే సినిమాలో ఉండదు. ఈ విషయం సితారకి తెలిసి గొడవ పెడుతుంది, సినిమాలో ఎందుకు లేదని. ఫ్యూచర్ లో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది అంటూ సితార గురించి మహేష్ మాట్లాడారు.

Mahesh Babu comments on Sitara :

Mahesh Babu comments on daughter Sitara 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ