ఎన్టీఆర్ - కొరటాల కలయికలో NTR30 జూన్ నుండి సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం కొరటాల ఆచార్య నెగెటివ్ మూడ్ నుండి బయట పడుతున్నారు. అలాగే NTR30 స్క్రిప్ట్ వర్క్ లోను కొరటాల బిజీగా వున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూన్నాయని, ఎన్టీఆర్ కోసం అద్భుతమైన బలమైన యాక్షన్ తో కూడా కథ సిద్దమవుతుంది అని, మిర్చి తర్వాత మళ్లీ అంతటి హై ఓల్టేజ్ కథని సిద్ధం చేస్తున్నట్టుగా కొరటాల చెప్పారు కూడా. దానితో NTR 30 అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే కొరటాలతో ఎన్టీఆర్ మీట్ అయ్యి ఆచార్య విషయం పక్కనపెట్టేసి.. ఆ సినిమా ఎక్కడ ఆడియన్స్ తిరస్కరణకు గురైందో చూసి ఆ తప్పులు NTR30 కి జరక్కుండా చూడాలని కొరటాలకి సలహా కూడా ఇచ్చారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది.
ఇక ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ కి 150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట. కల్యాణ రామ్ ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లేవల్లోనే తియ్యబోయే ఎన్టీఆర్ 30 కి మరీ భారీగా కాకుండా ఓ 150 కోట్ల బడ్జెట్ లిమిట్ లోనే సినిమా చెయ్యాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ని ఎంపిక చేసింది టీం. కాని ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.