బిగ్ బాస్ ఓటిటి లో లాస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్యన యుద్ధ వాతావరణాన్ని తలపించింది. నిన్నటివరకు ఫ్రెండ్లీ గా ఉంటామని చెప్పిన హౌస్ మేట్స్ నామినేషన్స్ ప్రక్రియలో కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అఖిల్ - బిందు మాధవి కి మధ్యన లాస్ట్ వీక్ నామినేషన్స్ లో పెద్ద యుద్ధమే నడిచింది. అఖిల్ యాటిట్యూడ్ వాళ్ళ మదర్ వచ్చాక మారింది, డ్రెస్సింగ్ స్టయిల్ మారింది, మొత్తం బిగ్ బాస్ గేమ్ మార్చేశాడు, ఆశు కి సపోర్ట్ చేస్తాడు అనుకుంటే.. అరియనాకి చేసాడు, అలాగే శివ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్ కాకుండా చేసావ్ అంటూ బిందు మాధవి అఖిల్ ని టార్గెట్ చేసింది. దానితో అఖిల్.. బిందు మాధవి లోపాలని ఎత్తి చూపించాడు. ఇక తర్వాత బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ మీరు పాప ని అడ్డం పెట్టుకుని బిగ్ బాస్ గెలవాలనుకుంటున్నారు అనగానే.. నీవు అసలు తెలుగమ్మాయివేనా.. మీ తండ్రి నీ వలన ఓడిపోయాడు అనగానే బిందు మాధవి మరింతగా రెచ్చియిపోయింది.
నటరాజ్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఇక అరియనాకి - మిత్ర శర్మకి మధ్యలో పెద్ద వివాదం నడిచింది. ఇక ఈ రోజుతో ఈ నామినేషన్స్ ప్రక్రియ ఆపేశాం.. రేపు మళ్ళీ మొదలవుతుంది అనగానే అందరూ హౌస్ లోపలికి వచ్చేసారు. మళ్ళీ బెడ్ రూమ్ లో నటరాజ్ మాస్టర్ కి బిందు మాధవికి మధ్యన గొడవ స్టార్ట్ అయ్యింది. ఇలాంటి పిచ్చివారికి ఓట్ వెయ్యకండి, ముందుకు తీసుకువెళ్లకండి అని నటరాజ్ కెమెరాలతో మాట్లాడుతుంటే.. బిందు మాధవి నాతో స్ట్రయిట్ గా మాట్లాడండి అంటూ రెచ్చగొట్టింది. ఇక నటరాజ్ ఎమోషనల్ గా రెచ్చిపోయి.. బిందు మాధవిని నానా మాటలు అన్నాడు. నేను గేమ్ ఆడాను, నువ్వు ఆడలేదు. అలానే చివరి వారం వరకు వచ్చేసావు అంటూ నటరాజ్ బిందుతో గొడవ పడుతూనే ఉన్నాడు. అఖిల్ వచ్చి నటరాజ్ ని తీసుకెళ్ళేవరకు ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది.