ఆచార్య రిలీజ్ అయ్యాక చిరంజీవి తన వైఫ్ సురేఖ తో కలిసి అమెరికా ట్రిప్ వేశారు. చిరు దాదాపు నెల రోజుల పాటు ఆయన నెక్స్ట్ డైరెక్టర్స్ కి అందుబాటులోకి రారు అంటున్నారు. చాలా కాలం తర్వాత చిరు భార్య తో కలిసి వెకేషన్స్ కి వెళ్లారు. అయితే చిరు ఈ వెకేషన్స్ తర్వాత ఓ పని పెట్టుకున్నారట. అదేమిటంటే.. ఆయన బరువు తగ్గే ప్రోగ్రాం అన్నమాట. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక కొన్నాళ్ళు ఫిట్ నెస్ పక్కన బెట్టారు. మళ్ళీ తొమ్మిదేళ్లకి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక చిరు కాస్త బొద్దుగానే ఉంటున్నారు. ఆచార్య లో చిరంజీవి మొహం బబ్లీ గాను కనిపించారు.
ఆయన స్క్రీన్ మీద కదలడానికి కాస్త ఇబ్బంది పడడమే కాదు, ఆయన డాన్స్ లో గ్రేస్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అనే విమర్శలతో చిరు ఇప్పుడు వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టారని, అమెరికా నుండి తిరిగొచ్చాక బరువు తగ్గేందుకు ఆయన పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ లోను, అలాగే భోళా శంకర్ లోను ఆయన కాస్త బొద్దుగా ఉన్నా పర్లేదు కానీ, తదుపరి బాబీ మూవీ లోను, అలాగే వెంకీ కుడుములు మూవీలను చిరు కాస్త సన్నగా కనబడితే బెటర్ అని ఆయన ఫిక్స్ అయ్యారట.