Advertisementt

గూస్ బమ్ప్స్ తెప్పిస్తున్న మేజర్ ట్రైలర్

Mon 09th May 2022 05:32 PM
major,major trailer,major sandeep unnikrishnan,adivi sesh  గూస్ బమ్ప్స్ తెప్పిస్తున్న మేజర్ ట్రైలర్
Major trailer: Adivi Sesh lives in the role of Major Sandeep Unnikrishnan గూస్ బమ్ప్స్ తెప్పిస్తున్న మేజర్ ట్రైలర్
Advertisement
Ads by CJ

మేజర్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన మేజర్ జూన్ 3 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సోల్జర్ లుక్స్ కి పెట్టింది పేరైన అడివి శేష్ మేజర్ ఫస్ట్ లుక్ లోనే అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా మేజర్ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. మహేష్ బాబు AMB మాల్ లో మేజర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఇక మేజర్ ట్రైలర్ లోకి వెళితే అడివి శేష్ తల్లితండ్రులైన రేవతి, ప్రకాష్ రాజ్ లకి తమ కొడుకు సోల్జర్ అవ్వడం ఇష్టం ఉండదు. కానీ సోల్జర్ గా మారాలని చిన్నప్పటినుండి అడివి శేష్ కలలు కంటాడు.

ట్రైలర్ లోకి వెళితే బోర్డర్ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లడం ఏమిటి, సందీప్ అది వాళ్ళది అని ఆర్మీ చీఫ్ అడిగితే అది మనదే కదా సర్ అంటాడు సందీప్ పాత్రధారి అడివి శేష్. 

ప్రకాష్ రాజ్ స్టేజ్ పై మాట్లాడుతూ సందీప్ ఆర్మీలో జాయిన్ అవడం మాకు ఇష్టం లేదు. ప్రతి రోజు, ప్రతి క్షణం లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవాలి, చాలా టఫ్ జాబ్, అయినా నా కొడుకు అదే ఎంచుకున్నాడు. వాడికి ఓ కొడుకుగా ఉండడం కంటే, ఓ మంచి భర్తగా ఉండడం కంటే సోల్జర్ గా ఉండడం అవసరం అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ముంబై తాజ్ బ్లాస్ట్ లో కొన్ని వందల ప్రాణాలను కాపాడి అమరవీడుయ్యాడు సందీప్ ఉన్ని కృష్ణన్. ఇక ట్రైలర్ లో అడివి శేష్ లుక్స్, అడివి శేష్ యాక్షన్, ఆయన విన్యాసాలు అన్ని గూస్ బమ్ప్స్ తెప్పించేలా ఉన్నాయి. నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని వేరే లెవల్ లో కనిపించాయి మేజర్ ట్రైలర్ లో.

మేజర్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Major trailer: Adivi Sesh lives in the role of Major Sandeep Unnikrishnan:

Major trailer: Emotional journey of Major Sandeep Unnikrishnan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ