మహేష్ బాబు చాలా సైలెంట్ గా, కామ్ గా ఫ్యామిలీ మాన్ గా కనిపిస్తారు కానీ ఆయనలో కామెడీ యాంగిల్ ఎంతగా ఉందో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు, అలాగే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లోను ఫాన్స్ కి బాగా అర్ధమైంది. ఇక సర్కారు వారి పాటలో మహేష్ బాబు లోని ఫన్ యాంగిల్ ని పరశురామ్ పూర్తిగా చూపించబోతున్నారు. పోకిరి, దూకుడు, ఖలేజా సినిమాల్లో మహేష్ లోని కామెడీ యాంగిల్ ని చూసినా.. సర్కారు వారి పాటలో అది మరింతగా ఎలివేట్ అవుతుంది అని ఆ సినిమా ట్రైలర్ ప్రూవ్ చేసింది.
ఇప్పుడు సర్కారు వారి పాట ప్రమోషన్స్ లోను మహేష్ తనలోని ఫన్ యాంగిల్ ని బయటికి తీస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ గారు మీ హీరోయిన్ కీర్తి సురేశ్ కి ఏదైనా సలహా ఇవ్వాలంటే.. ఎలాంటి సలహా ఇస్తారు అనే ప్రశ్నకు మహేష్.. మహానటి కీర్తి సురేష్ కి ఏం సలహా ఇస్తామండీ అని నవ్వేశారు. మీరు మీ పక్కన నటించిన హీరోయిన్స్ లో ఎంతమందికి బెస్ట్ కో స్టార్ అని చెప్పి ఉంటారు అనగానే మహేష్ ఫన్నీగా అలా చెప్పాలి కదండి, సినిమా చేసేది రెండేళ్ళకి, మరి మీరు బెస్ట్ అని చెప్పకపోతే ఎవరొచ్చి మన పక్కన నటిస్తారు అని అన్నారు. అలాగే మీ పక్కన గ్లామర్ గా కనిపించడానికి హీరోయిన్స్ చాలా కష్టపడాలి.. మీ గ్లామర్ రహస్యం ఏమిటో చెప్పమనగానే మహేష్ అన్నీ తింటాను.. కాకపోతే కరెక్టుగా తింటాను అంటూ సరదాగా మాట్లాడారు.