Advertisementt

ప్రభాస్ - మారుతీ మూవీ అప్ డేట్

Mon 09th May 2022 12:44 PM
prabhas,maruthi movie,prabhas - maruthi combo,salaar,project k,prabhas movie update  ప్రభాస్ - మారుతీ మూవీ అప్ డేట్
Prabhas - Maruthi Movie update ప్రభాస్ - మారుతీ మూవీ అప్ డేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉండడమే కాదు, మరోపక్క ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సలార్ తాజా షెడ్యూల్ ఈ నెలలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం లో వేసిన ఓ భారీ సెట్ లో మొదలు కాబోతుంది. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో పాటుగా ప్రభాస్ మారుతి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని, దాని కోసం మారుతి స్క్రిప్ట్ రెడీ చెయ్యడమే కాకుండా.. ఓ భారీ ఇంటి సెట్ నిర్మాణంలో తలమునకలై ఉన్నాడని అన్నారు. ఎందుకంటే ప్రభాస్ - మారుతి కలయికలో తెరకెక్కబోయే చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఆ ఇంటి సెట్ లో జరగబోతుందట.

ఆ లావిష్ ఇంటి సెట్ నిర్మాణం కోసం కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్ నడిచింది. అయితే రేపో మాపో మొదలవ్వబోతుంది అనుకుంటున్న మారుతి ప్రాజెక్ట్.. ఆగష్టు నుండి మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆగ‌స్ట్ నుంచి ప్ర‌భాస్ - మారుతి సినిమా సెట్స్ పైకి వెకెళుతుంది అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చినా ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమా కాస్త ఆల‌స్యంగా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు గ్లామర్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నారని.. అందులో కోలీవుడ్ నటి మాళవిక మోహన్ ఇప్పటికే ఫైనల్ అయినట్లుగా టాక్.

Prabhas - Maruthi Movie update:

Prabhas - Maruthi combo Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ