వెంకటేష్ - వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్లుగా బరిలోకి దిగే సమయం వచ్చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వుల పూయించడానికి రంగం సిద్ధమైపోయింది. దానిలో భాగంగానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. 2 నిమిషాల 32 సెకన్లు ట్రైలర్ నిడివి ఉన్న ఈ F3 ట్రైలర్ మొత్తం కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటుంది అదే డబ్బు అంటూ మురళి శర్మ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది.
మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు, మనీ ప్లాంట్ వేపుడు .. ఏంటి ఫుడ్ కూడా మనీ ప్లాంట్ తోనేనా ? తప్పదయ్యా బాగా డబ్బులు రావాలి కదా.. అనే డైలాగు అన్ని మిడిల్ క్లాస్ వర్గాల ప్రేక్షకులకు కనెక్టింగా వుంది. మన ఆశలే మన విలువలు పాతిక లక్షలు.. తెల్లారేసరికి యాభై లక్షలైపోవాలి.. అనే డైలాగ్స్ కూడా కంటెంట్ వైజ్ వినోదాన్ని పంచాయి. వాళ్ళది పెద్ద మాయల మరాఠి ఫ్యామిలీ అని రఘుబాబు అంటే వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మనది దగ్గుబాటి ఫ్యామిలీ అని వెంకటేష్ చెప్పడం వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ' అని వెంకటేష్ అంటే వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మనది మెగా ఫ్యామిలీ అని వరుణ్ తేజ్ అనడం ట్రైలర్ లో ఒక హైలెట్ గా నిలిచింది. ఈ డైలాగ్ ఎఫ్ 3పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
అనిల్ రావిపూడి తన రైటింగ్ అండ్ టేకింగ్‌తో దీన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించగా, వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, అలీ ఇలా అందరూ కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. వెంకటేష్ రే చీకటి మరియు వరుణ్ తేజ్ నత్తి అన్ని మిమ్మల్ని సరదాగా రైడ్‌కి తీసుకువెళతాయి. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, వాళ్ళ కలలను డబ్బుతో ముడిపెట్టి కామెడీ గా చూపించారు. తమన్నా మరియు మెహ్రీన్ ట్రెడిషనల్ గాను, మోడరన్ గాను ఇద్దరూ అద్భుతంగా కనిపించారు. ట్రయిలర్‌లో సోనాల్ చౌహాన్ నిడివి తక్కువగా ఉన్నా.. చాలా గ్లామర్ గా కనిపించింది, ఇందులో సునీల్ అలాగే వెన్నెల కిషోర్ పాన్ ఇండియా జూనియర్ నటుడిగా అలరించాడు. F3 ట్రైలర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సాయి శ్రీరామ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది, అలాగే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఎంటర్టైన్మెంట్ జోడించాడు. F3 మే 27న సినిమా థియేటర్లలో నవ్వులు పూయించబోతుంది.